Bodhan | మున్సిపల్ ఎన్నికల కేంద్రాలు పరిశీలన…

Bodhan | మున్సిపల్ ఎన్నికల కేంద్రాలు పరిశీలన…
Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ, బాలెట్ బాక్స్ ల భద్రత తదితర అంశాలపై చర్చించారు. వార్డుల వివరాలు పోలింగ్ కేంద్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే విజయ మేరీ పాఠశాల ను సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తో కలిసి పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తాసిల్దార్ విట్టల్ తో ఎన్నికల వివరాలు అడిగి తెలుసు కున్నారు.
