TG |జాతర గోడ ప‌త్రిక‌ల‌ విడుదల

TG |జాతర గోడ ప‌త్రిక‌ల‌ విడుదల

TG | దండేపల్లి, ఆంధ్రప్రభ : ఈ నెల 30నుండి వచ్చేనెల 1వ తేదీ వరకు జరిగే గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర గోడపత్రులను మంగళవారం దండేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎస్సై తహసినోద్దీన్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… స్వస్తిశ్రీ విశ్వవసునామసంవత్సర మాఘశుద్ద పౌర్ణమి రోజున మొదలై వారం రోజులుగా జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ నాయకులు తట్ర అర్జున్, తట్ర రమేష్, గడ్డం చరణ్ కుమార్, మోడితే నరసయ్య, పెగ్గే శంకర్, తట్ర శంకర్, కొత్తపెళ్లి రమేష్, గడ్డం విగ్నేష్, బీసీ సంఘం నాయకులు. ముత్తినేని శ్రీనివాస్, అత్తే రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply