TG | జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం

TG | జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం
TG | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భీమ్‌గల్ మండలం రెవెన్యూ శాఖలో విశేష సేవలందించి నందుకు ఆర్ఐ అన్నగోడల్లా సాయగౌడ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వం ప్రశంస పత్రంని రావడంతో తహసిల్దార్ మొహమ్మద్ షబ్బీర్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, భీమ్‌గల్ మండలం రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్ఐ.సాయగౌడ్ కు ప్రశంస పత్రం అందుకున్నారు. పురస్కారం అందుకున్న ఈ సందర్భంగా ఆర్ఐ సాయ గౌడ్ మాట్లాడుతూ, ఈ గుర్తింపు నాకు మరింత బాధ్యతను పెంచిందన్నారు.
వృత్తి పరమైన నైపుణ్యాన్ని అంకిత భావంతో నిర్వర్తిస్తూ, ఆత్మ విశ్వాసంతో ప్రజలకు మరింతగా సేవా భావంతో పనిచేస్తానని అన్నారు.రెవెన్యూ శాఖలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులోఉండి సేవలందిస్తానని అన్నారు. ఆర్ఐ సాయ గౌడ్ కు ప్రశంస పత్రం పురస్కారం రావడం పట్ల రెవెన్యూ శాఖ డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ డ్యూటీ అశ్విన్ బాబు, ఆర్ఐ లు మల్లేష్, స్వాతి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ రెడ్డి, అజ్మత్, జూనియర్ అసిస్టెంట్ లు శివ, పల్లవి,హారిక, శారద, రజిత, అంజయ్య, శ్రీకాంత్ చిన్న సాహెబ్, రికార్డ్ అసిస్టెంట్ రాహుల్, నరేష్ సిబ్బందితో మండలంలో గల పలువురు ప్రజా ప్రతినిధులు అభిమానులు శుభాకాంక్షలు తెలిపినట్లు ఆర్ఐ తెలిపారు.
