Crime | కుమార్తెపై దాడిచేసి..

Crime | కుమార్తెపై దాడిచేసి..
Crime | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తన 11ఏళ్ల కుమారుడి గొంతుకోసి, అనంతరం 13ఏళ్ల కుమార్తెపై కూడా తల్లి కత్తితో దాడిచేసి గాయపరిచిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. బైఫ్ రోడ్ ప్రాంతంలో నివసిస్తున్న సోని సంతోష్ జైభాయ్ అనే మహిళ తన 11 ఏళ్ల కుమారుడిని గొంతు కోసి హత్య చేసింది. అనంతరం 13 ఏళ్ల కుమార్తెపై కూడా కత్తితో దాడి చేసి గాయపరిచింది.
బాలికను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘాతుకానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
