Jukkal | అర్చకులను ప్రభుత్వం ఆదుకోవాలి

Jukkal | అర్చకులను ప్రభుత్వం ఆదుకోవాలి
Jukkal | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : ధూప, దీప, నైవేద్యం అర్చకులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని జుక్కల్ మండల ధూప, దీప నైవేద్యం అర్చకుల సంఘం జుక్కల్ మండల అధ్యక్షుడు జోషిదత్తు మహారాజ్ కోరారు. మహాదేవుని గుడిలో ధూప, దీప,నైవేద్య అర్చక సంఘం క్యాలెండర్లను అర్చకులతో కలిసి ఆవిష్కరించారు. పురాతన మందిరాలతో పాటు నూతనమందిరాల్లో సయితం తరతరాలుగా అర్చకులు తమ సేవలను అందిస్తున్నారని,తమ సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్చకులందరికీ ఆర్థికంగా ఆదుకోవడమే, అర్హులైన అర్చకులకు ఇందిరమ్మ గృహాలు నిర్మించి ఇవ్వాలని, సమయనుసరం పారితోషకాన్ని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సాయిమహరాజ్, సంగయ్యప్ప స్వామి, విశ్వనాథ్ స్వామి, బాబయ్య స్వామి, గణపతి స్వామి, గుండు మహారాజ్, రమేష్ స్వామి, దత్తుస్వామితో పాటు వివిధ గ్రామాల అర్చకులు పాల్గొన్నారు.
