Airport | 50 విమానాలు రద్దు

Airport | 50 విమానాలు రద్దు
Airport | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : జమ్మూకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో, శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 విమానాలను రద్దు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం, నిరంతరాయంగా మంచు కురుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్‌కు రావాల్సిన 25, బయలుదేరాల్సిన 25 విమానాలను రద్దు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లనే విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
