Suresh Productions | వెంకీ, తరుణ్ భాస్కర్ తెర వెనుక జరిగింది ఇదే..

Suresh Productions | వెంకీ, తరుణ్ భాస్కర్ తెర వెనుక జరిగింది ఇదే..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది.. చిత్రాలతో సక్సెస్ సాధించి తరుణ్ భాస్కర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే.. ఆతర్వాత వెంకీతో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ.. ఇంత వరకు ఆ ప్రాజెక్ట్ ఏమైందో క్లారిటీ లేదు. వెంకీ వేరే ప్రాజెక్టుల్లో (Project) బిజీ అయ్యారు. తరుణ్ భాస్కర్ యాక్టర్ గా బిజీ అయ్యాడు. అయితే.. వెంకీ ప్రాజెక్ట్ గురించి అసలు ఏం జరిగిందో తరుణ్‌ ఇప్పుడు బయటపెట్టాడు. ఇంతకీ.. తెర వెనుక ఏం జరిగింది..?

Suresh Productions

Suresh Productions | ఇదే రైట్ టైమ్..

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించడంతో.. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు తరుణ్‌ భాస్కర్. కథ రెడీ చేశాడు కానీ.. పట్టాలెక్కకపోవడంతో ఇక ఈ ప్రాజెక్ట్ లేనట్టే అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉందంటున్నాడు తరుణ్‌ భాస్కర్. ఇంకా చెప్పాలంటే.. తను రాసిన స్క్రిప్ట్ తో సినిమా చేయడానికి ఇదే రైట్ టైమ్ అంటున్నాడు. ఎందుకని ఈ కథ ఇంత వరకు పట్టాలెక్కలేదు. అసలు ఏం జరిగిందంటే.. అసలు విషయం బయటపెట్టాడు తరుణ్ భాస్కర్.

Suresh Productions

Suresh Productions | ఇంత వరకూ రాని బ్యాక్ డ్రాప్..

ఇంతకీ ఏం చెప్పాడంటే.. అప్పట్లో తను రాసిన స్క్రిప్ట్ ఫస్టాఫ్ బాగుందట కానీ.. సెకండాఫ్ తనకే నచ్చలేదట. ఆ కథను చాలా సార్లు తిరగరాసాడట. వెంకటేష్, సురేష్‌ బాబు.. ఇద్దరికీ ఓ వెర్షెన్ నచ్చిందట. కాకపోతే తరుణ్‌ భాస్కర్ కే ఇంకా బెటర్ గా రాయచ్చు అనిపించిందట. తన స్క్రిప్ట్ ను రాస్తూనే ఉన్నాడట. ఇప్పుడు టైమ్ వచ్చింది అనిపిస్తుందని.. 2026లోనే ఈ సినిమా పట్టాలెక్కచ్చని తరుణ్ భాస్కర్ చెప్పడం విశేషం. హార్స్ రైడింగ్ నేప‌థ్యంలో సాగే సినిమా (Movie) ఇది. ఈ బ్యాక్ డ్రాప్ లో ఇంత వ‌ర‌కూ సినిమా రాలేదు. కాబ‌ట్టి.. కొత్త‌గా ఉంటుంది.. అందరికీ నచ్చుతుంది అంటున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్‌ బాబు ఈ సినిమాని నిర్మించనున్నారు. మరి.. వెంకీ, తరుణ్‌ భాస్కర్ కాంబో ఇప్పటికైనా సెట్స్ పైకి వస్తుందేమో చూడాలి.

Suresh Productions

CLICK HERE TO READ పవన్ కళ్యాణ్‌ అభినందనలు..

CLICK HERE TO READ MORE

Leave a Reply