Canal water | రోడ్డుపై వృధాగా పోతున్న కడెం కెనాల్ నీరు….

Canal water | రోడ్డుపై వృధాగా పోతున్న కడెం కెనాల్ నీరు….
- పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు.
Canal water | దండేపల్లి, ఆంధ్రప్రభ : కడెం ప్రధాన కాలువ నుండి 28వ డిస్టిబ్యూటర్ కు వచ్చే నీరు దండేపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై వృధాగా పోతున్న అధికారు ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడంతో స్థానికులు వెళ్లి నీరు రోడ్డుపై రాకుండా చేశారు. కాలువను ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో చెత్త చెదారం నిండి రోడ్డు దగ్గర ఉన్న పైపులో తట్టుకోని ఉండడంతో నీరు పూర్తిగా రోడ్డుపై కి వస్తున్నాయి.
ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువలో ఉన్న చెత్తను పూర్తి తొలగించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ఇరిగేషన్ డిఈ వెంకటేశంను ఫోన్ లో వివరణ కోరగా ఆయన స్పందించి అధికారులతో మాట్లాడి కాలువలో ఉన్న చెత్తను తొలగించి రోడ్డుపైకి నీరు రాకుండా చూస్తామన్నారు.
