Collector | ఉత్తమ సేవలకు ఉత్తమ అవార్డులు

Collector | ఉత్తమ సేవలకు ఉత్తమ అవార్డులు
Collector | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి చెందిన రెవెన్యూ శాఖ ఇన్స్పెక్టర్ మోహన్, మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మోహన్ లు విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు వారికి ఉత్తమ పురస్కార జిల్లా స్థాయి అవార్డులు లభించాయి.
అవార్డులు పొందిన వారు ఈ రోజు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కె హరిత చేతుల మీదుగా ఎమ్మెల్యే కోవలక్ష్మి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సమక్షంలో అవార్డులు అందుకున్నారు. వారికి ఉత్తమ అవార్డు రావడం పట్ల జైనూర్ తాసిల్దార్ ఆడబీర్షావ్, జైనూర్ ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, హాయ్ అక్క కార్యాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

