Cultural | ఘనంగా ప్రారంభమైన శ్రీధం.. 2026

Cultural | ఘనంగా ప్రారంభమైన శ్రీధం.. 2026

Cultural | హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, ఆత్మవిశ్వాసం, పెంపొందించేందుకు సాంస్కృతిక వేడుకలు ఎంతో దోహదపడతాయని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ సమీపాన గల సుమతి రెడ్డి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను కళాశాల ప్రిన్సిపాల్ ఐ రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించి, వేడుకలను నిర్వహించారు.

అనంతరం ప్రతి ఏటా నిర్వహించే కళాశాల వార్షికోత్సవంలో బాగంగా రెండు రోజుల పాటు నిర్వహించే శ్రీధం..2026 సాంస్కృతిక సంబరాలను ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ తోపాటు ప్రిన్సిపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సార్ విద్యా సంస్థల చైర్మన్ మాట్లాడుతూ… దేశంలోని వివిధ పండుగలు, సామాజిక, సంస్కృతి ప్రాధాన్యతను వివరించారు. ఇలాంటి వేడుకలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

Cultural |

విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న నైపుణ్యాలను తీసేందుకు ఏటా ఈ వేడుకలను వైభోవపేతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు.మతాలు, వివిధ సంస్కృతుల ప్రజలు పరస్పరం గౌరవంతో కలిసి జీవించడం మన దేశ ప్రత్యేకత అని అన్నారు. వేడుకల్లో విద్యార్థినులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

దినోత్సవంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలను తయారుచేసి ప్రదర్శించారు మన రాష్ట్ర సంస్కృతి బోనాల పండుగ, ఉగాది, కృష్ణాష్టమి పండుగ విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే రంజాన్ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత.క్రైస్తవ సంప్రదాయాన్ని ప్రతిభింభించే విధంగా నిర్వహించిన వేడుకలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అదేవిధంగా ఆనందోత్సవాలతో గాలిపటాల పండుగ కొనసాగింది. అనంతరం నృత్యాలు, ఫ్యాషన్ షోరాంపు, వాక్ వీల్స్ వంటి కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ లు ఝాన్సీరాణి, జైవేదిక, వివిధ విభాగాధిపతులు సుదర్శన్, కుమారస్వామి, కే శ్రీనివాస్,ప్రశాంత్, ఎస్ శ్రీవాణి ఏవో వేణుగోపాల్ స్వామితో పాటు విద్యార్థి కోఆర్డినేటర్లు అర్చన, వర్షిత, తన్మయి, సరయు, అక్షయ రెడ్డి, శ్రీజ అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a Reply