TG | గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

TG | గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
- డ్రైవింగ్ సీటులోనే కుప్పకూలిన బస్సు డ్రైవర్ నాగరాజు
TG | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : గుండెపోటుతో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ కుప్పకూలినవిషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న అమరావతి బస్ డ్రైవర్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.
చౌటుప్పల్ వద్ద బస్సును పక్కకు ఆపి సీటులోనే కుప్పకూలారు. డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించగా… అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడిని విజయవాడ డిపోలో పనిచేస్తున్న గొల్లపూడికి చెందిన నాగరాజుగా గుర్తించారు. బస్సును పక్కకు ఆపివేయడంతో బస్సులోని 19 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
