Celebration | జాతీయ జెండాకు అవమానం

Celebration | జాతీయ జెండాకు అవమానం
- జాతీయ జెండా అవమానంపై దేశభక్తుల,స్థానికుల ఆగ్రహం
Celebration | తాడ్వాయి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం చోటు చేసుకుంది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాడ్వాయి తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణలో భాగంగా జెండాకు వేసిన చిక్కుముడి దారం విచ్చుకోకపోవడంతో కొద్దిసేపు క్రిందకు, మీదకు లాగారు. అయినా చిక్కుముడి విచ్చుకోకపోవడంతో జెండాను కిందికి దింపి మధ్యలోనే ముడి విప్పి మధ్యలోనే ఎగరవేశారు. జాతీయ జెండాను పూర్తిస్థాయిలో ఎగరవేయకుండా మధ్యలోనే ఎగరవేయడంపై అక్కడున్న ప్రజా ప్రతినిధులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ జెండాపై ఇంత నిర్లక్ష్యం పనికిరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభక్తికి , దేశభక్తులను అవమానపరిచినట్లు అని అన్నారు. జాతీయ జెండాపై కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
