Southern Philippines | 15 మంది మృతి

Southern Philippines | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జాంబోంగా నుండి సులు ప్రావిన్స్‌కు 359 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ షిప్ ఇవాళ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. 316 మందిని రక్షించారు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు ఫిలిప్పీన్స్‌ కోస్ట్‌ గార్డ్‌ పేర్కొంది. 332 మంది ప్రయాణికులు, 27 మంది సిబ్బందితో ఫెర్రీ బోటు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికీ 28 మంది ఆచూకీ తెలియదని అధికారులు తెలిపారు.

Leave a Reply