TG | హేమలతకు ఉత్తమ ప్రతిభా పురస్కారం

TG | అచ్చంపేట, ఆంధ్రప్రభ : 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విధినిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి, సేవాభావంతో బాధ్యతలు నిర్వర్తించిన అచ్చంపేట డివిజన్ పరిధిలోని గ్రామీణ నీటిపారుదల శాఖ – మిషన్ కాకతీయ విభాగంలో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న హేమలతను ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేసి ఉత్తమ ప్రతిభా పురస్కారంతో సత్కరించారు.

ఈ రోజు నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లురవి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ అమరేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో హేమలత చేసిన సేవలను ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కొనియాడారు.

నీటి నిల్వ సామర్థ్య వృద్ధి, లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న చెంచులకు, గ్రామీణ ప్రాంతాల సాగునీటి వసతుల మెరుగుదలలో ఆమె పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. విధి పట్ల ఆమె చూపిన నిబద్ధత, బాధ్యతా భావం ఇతర ఉద్యోగులకు ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా వారు తెలిపారు.

Leave a Reply