Meghadrigadda | దారుణ హత్య…

Meghadrigadda | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లా మేఘాద్రిగడ్డ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితులు యువకుడి ముఖంపై మద్యంసీసాలతో దాడిచేసి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.
హత్యకు గురైన యువకుడు గుంటూరుకు చెందిన కల్యాణ్ చక్రవర్తిగా నిర్ధారించారు. గత రాత్రి మేఘాద్రిగడ్డ వద్ద కొందరు యువకులు పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనోజ్, వినోద్ అనే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
