Best awards | మున్సిపల్ అధికారులకు ఉత్తమ అవార్డులు

Best awards | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని మున్సిపల్ అధికారుల సేవలను గుర్తించి హనుమకొండ జిల్లా కలెక్టర్ ఉత్తమ పురస్కారం అందించారు. పరకాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో టీపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కే సుష్మ తోపాటు మున్సిపల్ ఆర్ఐ గా విధులు నిర్వహిస్తున్న గుబల రవి సేవలను గుర్తించి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఉత్తమ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సహ ఉద్యోగులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఇరువురికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
