Zaynur | ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Zaynur | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసి ఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఈ రోజు ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభాతభేరి ర్యాలీలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఆడ బీర్షావ్ జాతీయ జెండా ఆవిష్కరించగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ కొడప ప్రకాష్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ రావు, జై నూర్ జెడ్పి పాఠశాలలో ఎమ్మార్సీలో మండల విద్యాశాఖ అధికారి మధుకర్ జాదవ్, బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఇంతియాజులాల, అబ్దుల్ ముఖిద్, వెటర్నరీ ఆసుపత్రిలో వెటర్నరీ సుఖేందర్ రాథోడ్, పోలీస్ స్టేషన్ లో సీఐ రమేష్, ఎస్ఐ రవికుమార్, జైనూర్ మండల కేంద్రంలోని భారతి, కేరళ, గ్లోబల్, ఉర్దూ గుల్షన్ పాఠశాలల్లో కరెస్పాండెంట్లు పోలిపల్లి నరేందర్, జమీల్ ఖాన్, నజీమొద్దీన్, ఎంఏ మజా ర్ రాజా, ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీఓ ఇందిరా, ఐకెపికార్యాలయంలో ఏపిఎం శ్రీకాంత్,మొతు బాయి, సహకార బ్యాంకులో మేనేజర్ రాజేశ్వర్, సహకార సంఘం కార్యాలయంలో సీఈఓ జనార్ధన్, కొమరం భీమ్ చౌరస్తాలో గ్రామ పటేల్ కొడప వామన్ రావు, బాలికల అశ్రమన్నత పాఠశాలలో హెచ్ఎం పార్వతి, వివిధ పాఠశాలల్లోగ్రామపంచాయతీలో ప్రైవేటు సంస్థల లో జాతీయ జెండాలు ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో గణతంత్ర వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, మాజీ సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, జై నూరు ఉపసర్పంచ్ డోంగ్రే ప్రకాష్, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు, వ్యాపారులు,ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
