Ganapuram | ఉత్తమ పంచాయతీ కార్యదర్శి గా ప్రశంసా పత్రం..

Ganapuram | గణపురం, ఆంధ్రప్రభ : 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అందించే జిల్లాస్థాయి అవార్డును మండలంలోని చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి ముక్కెర హేమంత్ అందుకున్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందజేశారు.
