Jukkal | ఉత్తమ సేవకు గుర్తింపుగా…

Jukkal | ఉత్తమ సేవకు గుర్తింపుగా…
- అవార్డు అందుకున్న ఉప తహిసిల్దార్ హేమలత
Jukkal | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల ఉప తహసీల్దార్ హేమలత నిస్వార్ధంగా తమసేవలను అందించడం జరిగింది. దీనికి గుర్తింపుగా గణతంత్ర దినోత్సవన్నీ పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఎస్పీ రాజేష్ చంద్ర చేతుల మీదుగా ఉత్తమ సేవాఅవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ యంత్రాంగంతో పాటు జుక్కల్ మండల ప్రజలుసైతం ఉప తహసీల్దార్ హేమలతకు అభినందనలు తెలియజేశారు. దీంతోపాటు ఉత్తమ సేవలందించినందుకు ఎంపీఓ రాము, పంచాయతీరాజ్ డీఈఈ మధుబాబు, ప్రభుత్వ వైద్యులు విట్ఠల్ కు సయితం ఉత్తమసేవా అవార్డులు దక్కాయి.
