Chennur | సమిష్టి కృషితో దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి…

Chennur | సమిష్టి కృషితో దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి…

Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రజలందరి సమిష్టి కృషితో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్ర కార్మిక,ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వివేక్ స్థానిక క్యాంప్ కార్యాలయంలో జాతీయజెండా ఎగురవేసి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల, మతాలకు అతీతంగా అందరు సమానత్వంతో జీవించాలనే ప్రపంచంలోనే ఏ దేశం లేని విధంగా అతిపెద్దరాజ్యాంగాన్ని రూపకల్పన చేసి భారత దేశానికి అందించారాని ఆయన చూపిన మార్గదర్శకాలు పాటిస్తూ యువత దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పలు శాఖ ల అధికారులు పాల్గొన్నారు.

Chennur

Leave a Reply