TG | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

TG | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

  • జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి..

TG | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.. రఘునాథపల్లి మండలంలో పల్లె పల్లెల్లో వాడవాడల్లో జాతీయ జెండా లు రెపరెపలాడాయి.. రూరల్ సర్కిల్ కార్యాలయం వద్ద సీఐ శ్రీనివాస్ రెడ్డి, త‌హ‌శిల్దార్‌ కార్యాలయం వద్ద నాయబ్ త‌హ‌శిల్దార్‌, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీనివాస్ గుప్తా, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై నరేష్ యాదవ్, మండల గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ బొల్లం ఉమారాణి, బస్టాండ్ సమీపంలో బి ఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ వై కుమార్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బొల్లంఅజయ్ మణికంఠ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు రవి గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. సీఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది భారత రాజ్యాంగం అని ఈరోజు ఏ దేశం వెళ్లిన భారతీయులమని గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి కారణం భారత రాజ్యాంగం గొప్పతనం అని ఆయన అన్నారు. దేశ స్వాతంత్రానికి మరియు రాజ్యాంగ నిర్మాణానికి తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు..

Leave a Reply