Eturunagaram | వైభవంగా 77వ గణతంత్ర వేడుకలు

Eturunagaram | ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : ఏటూరునాగారం పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కాకులమర్రి శ్రీలత జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆమె తెలిపారు. ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాలకవర్గం, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
