Nithin | నితిన్ ఆ.. డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా..?

Nithin | నితిన్ ఆ.. డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా..?
Nithin | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నితిన్ ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించాడు. ఈమధ్య కాలంలో కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. ఇంకా చెప్పాలంటే.. కొత్తగా ట్రై చేస్తున్నాడు కానీ.. సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు. తమ్ముడు, రాబిన్ హుడ్ సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అవ్వడంతో తన మార్కెట్ పడిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు చేసే డైరెక్టర్ తో సినిమా (Movie) చేయడానికి ఓకే చెప్పాడు. అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంతకీ.. ఎవరా డైరెక్టర్..? ఈసారైనా నితిన్ సక్సెస్ సాధించేనా..?

వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నితిన్ తన 36 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకీ ఎవరితో సినిమా చేయనున్నారంటే.. వెర్సటైల్ డైరెక్టర్ (Director) వి.ఐ.ఆనంద్ తో అని ప్రకటించారు. పవన్ కుమార్ సమర్పణలో సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మేకర్స్ సైఫై ఎంటర్‌టైనర్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. విభిన్నమైన కథలు, కథనాలతో సినిమాలను రూపొందించే దర్శకుడు వి.ఐ.ఆనంద్ మరోసారి ఈ భారీ ప్రాజెక్ట్‌తో క్రియేటివ్ బౌండరీస్ రేంజ్‌ను మరింత పెంచటానికి సిద్ధమయ్యారు.

సినీ ప్రేక్షకులకు ఇప్పటి వరకు చూడని సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా ఈ క్రేజీ సినిమా రూపొందనుంది. ఊరు పేరు భైరవకోన చిత్రం తర్వాత ఈ విజనరీ డైరెక్టర్ హై కాన్సెప్ట్ సైఫై ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను మెప్పించనున్నారు. టాలెంటెడ్ యాక్టర్ నితిన్ (Nithin) హీరోగా నటిస్తుండటంతో ఈ మూవీ పై ఎగ్జయిట్‌మెంట్ మరింతగా పెరిగింది. వెర్సటైల్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే నితిన్ వంటి కథానాయకుడితో.. క్వాలిటీ సినిమాలను గ్రాండ్ స్కేల్‌లో సినిమాను రూపొందించే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ చేతులు కలపటం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఈ ప్రెస్టీజియస్ కాంబోను చూస్తుంటే.. సినిమా (Movie) పై నిర్మాత శ్రీనివాస చిట్టూరికి ఉన్న ప్యాషన్ కనిపిస్తోంది. ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. టాలెంటెడ్ హీరో, వైవిధ్యంగా సినిమాను తెరకెక్కించే దర్శకుడు, గ్రాండ్‌గా సినిమాను నిర్మించే సంస్థ కలయికలో రూపొందబోయే ఈ సైఫై ఎంటర్‌టైనర్ నితిన్ కెరీర్‌లో అత్యంత ఆసక్తికరమై ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా మారనుంది. నితిన్ 36వ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. మరి.. ఈ సినిమాతో అయినా నితిన్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.
