Amaravati | గణతంత్ర దినోత్సవ వేడుకలు

Amaravati | అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ పరేడ్‌లో గవర్నర్‌ 11 దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Amaravati

జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్వీకరించారు. ఈ ఏడాది వేడుకల్లో 22 అలంకృత శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందేమాతరం, పది సూత్రాల మిషన్, అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ, పాఠశాల విద్య, వ్యవసాయ శాఖ, సీఆర్‌డీఏ తదితర విభాగాల శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. ఈ వేడుకలకు అమరావతి రైతులు, స్థానికులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply