Volleyball | ఆడుతూ యువకుడు మృతి..

Volleyball | నల్లచెరువు, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండలం కే పూలుకుంట గ్రామంలో వాలీబాల్ ఆడుతూ జావీద్ (17) అనే యువకుడు ఈ రోజు మృతి చెందాడు. కే పూలుకుంటకు చెందిన బేల్దారి పని చేస్తున్న ఖలీల్ కుమారుడైన జావీద్ ఆదివారం వాలీబాల్ ఆడుతూ ఒక్క‌సారిగా కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వాలీబాల్ ఆట ఆడుతూ కుప్ప కూలిపోయిన జావిద్ ను ఆట స్థలంలో నుండి అక్కడున్న కొందరు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్టు తెలిపారు. దీంతో వాలీబాల్ ఆటే ఆ ఇంటికి శాపంగా మారింది. చేతికి ఎదిగిన కొడుకు ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లిదండ్రులు తల్ల డిల్లిపోయారు.

Leave a Reply