TG | ట్రాక్టర్ నడుపుతూ హల్చల్…

TG | ట్రాక్టర్ నడుపుతూ హల్చల్…

TG | నల్గొండ, ఆంధ్రప్రభ : రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు జిల్లా కేంద్రంలో సుడిగాలి పర్యటన చేస్తూ ట్రాక్టర్ నడుపుతూ హల్చల్ చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని పలు వార్డులు పర్యటించి మాట్లాడుతూ… నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మార్చడమే నా లక్ష్యమని అందులో భాగంగానే నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ చేయడం జరిగిందన్నారు. నల్గొండ పట్టణంలో అమృత స్కీం కింద ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని ఉద్దేశంతో 216 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. 750 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.

అదేవిధంగా జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో అధిక వసతులు కోసం ఐదు కోట్లతో ఏసీల తోపాటు పలు సమస్యలను చేయడం జరిగింది అన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి వైద్య సేవ అందుతున్నాయి అన్నారు. కార్పొరేషన్ స్థాయిలో జరిగే ఎన్నికల్లో 48 డివిజన్ల కార్పొరేటర్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పాశం రామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్, రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు వేణుగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply