Choutuppal | జాతీయ ఓటరు దినోత్సవం, మానవహారం, ప్రతిజ్ఞ

Choutuppal | జాతీయ ఓటరు దినోత్సవం, మానవహారం, ప్రతిజ్ఞ

Choutuppal | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఈ రోజు జాతీయ ఓటరు దినోత్సవం ను పురస్కరించుకొని మండల డిప్యూటీ తహసిల్దార్ పజ్జురి సిద్ధార్థ రెడ్డి, ఎంఈఓ గురువారావు ల ఆధ్వర్యంలో 16వ జాతీయ ఓటర్ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. మానవహారం, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా 84 సంవత్సరాల సీనియర్ ఓటరు కు, నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువకుడి కి అధికారులు శాలువా కప్పి సన్మానించారు. బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కును మద్యం కు, డబ్బులకు అమ్ముకోవద్దన్నారు. ఎన్నికలలో సమర్ధుడైన మంచి వ్యక్తికి తమ ఓటు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ గిర్దావరి కొప్పుల సుధాకర్ రావు, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply