Minister | వజ్రాయుధం వంటిది ఓటు హక్కు

Minister | వజ్రాయుధం వంటిది ఓటు హక్కు

  • రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

Minister | మక్తల్, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది వజ్రవైదం లాంటిదని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని తద్వారా బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

16వ ఓటరు జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక తహశీల్దార్ సతీష్ కుమార్, సిఐ రామ్ లాల్ యువకులతో కలిసి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం నుండి నిర్వహించిన సైకిల్ ర్యాలీకి ముఖ్యఅతిథిగా పాల్గొని యువతలో ఉత్సాహాన్ని నింపారు.

అందరితో ఓటరు దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి వంటిదని అన్నారు.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ నేడే ఓటరుగా పేరును నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో మనం భాగస్వాములవుదాం ఓటరు అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమైనదని అన్నారు.

ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉన్న పౌరులు తమ ఓటు హక్కును వినియో గించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును నియోగించుకోవాలని అన్నారు. ప్రజా ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధమని అన్నారు.

ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును నీతి నిజాయితీ నిబంధనతో ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అది జడ్పిటిసి జి .లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కోళ్ళ వెంకటేష్ , హేమసుందర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply