Balkonda | గ్రామ దేవతలకు జలాభిషేకం

Balkonda | బాల్కొండ, ఆంధ్రప్రభ : మాఘ మాస రెండవ ఆదివారం సందర్భంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గ్రామ పెద్దమనుషుల ఆధ్వర్యంలో గ్రామంలోని పలు దేవతలకు గంగనీళ్లతో జలాభిషేకం నిర్వహించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుండి గంగాజలాలను ఊరి ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ గ్రామంలోని సకల దేవతలు పోచమ్మ మందిరాలను గంగజలాలతో తో శుభ్రపరిచి జలాభిషేకం నిర్వహించారు.
గ్రామంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు మంగళహారలతో స్వాగతం పలికారు.భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ తమ మొక్కులను చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా పోచమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద మనుషులు,గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చిట్టాపూర్,కిసాన్ నగర్ లో…
బాల్కొండ మండలంలోని చిట్టాపూర్, కిసాన్ నగర్ గ్రామలలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు గ్రామంలోని పలు గ్రామ దేవతలకు గంగానీళ్లతో జలాభిషేకం నిర్వహించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుండి గంగాజలాలను ఊరి ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ గ్రామంలోని సకల దేవతలు పోచమ్మ మందిరాలను గంగజలాలతో తో శుభ్రపరిచి జలాభిషేకం నిర్వహించారు. గ్రామాలలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు మంగళహారలతో స్వాగతం పలికారు.భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ తమ మొక్కులను చెల్లించుకున్నారు.
