Cherla | మావోల కుట్ర భగ్నం

Cherla | మావోల కుట్ర భగ్నం
- రెండు ఆయుధ డంప్ లు స్వాదీనం
Cherla | చర్ల, ఆంధ్ర ప్రభ : మరోమారు పోలీసు బలగాలు మావోయిస్టుల కుట్ర భగ్నం చేశారు. ఛత్తీస్గడ్ రాష్ట్రం సుక్మా, బీజాపూర్ సరిహద్దులోని రెండు మావోయిస్టు ఆయుధాల డంప్ లను ఈ రోజు సీఆర్‌పీఎఫ్ 150 బెటాలియాన్ బలగాలు స్వాదీనం చేసుకున్నారు. ఈ డంప్ లలో పెద్ద ఎత్తున ఆయుధాలు లభ్యం అయ్యాయి. శనివారం సైతం బీజాపూర్ జిల్లా, మద్దెడ్ పోలీస్టేషన్ పరిధిలోని బందెపర, నీలమడుగు అటవీ ప్రాంతంలో 16 ఐ ఈ డి ఫ్రెషర్ బాంబులు, 100 కేజీల పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాదీనం చేసుకున్నారు. గణతంత్ర దినోత్సవాల సమయంలో ఎటువంటి విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించి అడవులను గాలిస్తున్నాయి.
