Former Minister | సింగరేణిలో నైని, సోలార్ స్కామ్‍లే కాదు..

Former Minister | సింగరేణిలో నైని, సోలార్ స్కామ్‍లే కాదు..

  • ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయి
  • మాజీ మంత్రి హ‌రీశ్ రావు

Former Minister | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సింగ‌రేణి స్కామ్ తో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు భట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పై భట్టి అవాస్తవాలు మాట్లాడారన్నారు. రేవంత్ రెడ్డే అవినీతి చేస్తున్నారంటే ఆయనతో మాట్లాడటమేంటని ప్రశ్నించారు.

సింగరేణిలో నైని, సోలార్ స్కామ్‍లే కాదని ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయని వాటిని త్వరలోనే బయటపెడతానన్నారు. సైట్ విజిట్ విధానం లోపభూయిష్టం అని ఇది వద్దని సింగరేణికి ఫిర్యాదులు వచ్చింది నిజం కాదా? ఈ విషయం మీటింగ్‍లో మాట్లాడారా లేదా బయటపెట్టాలని భట్టికి చాలెంజ్ చేశారు. మినిట్స్ ఆఫ్ ది మీటింగ్స్ బయటపెట్టాలన్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. సీఎం బావమరిది ఏ హోటల్ లో కూర్చుని టెండర్లు నిర్ణయించారో తమకు తెలుసని, ఆఫోటోలు కూడా సమయం వచ్చినప్పుడు బయటపెడతామన్నారు. సిట్టింగ్ జడ్జి.. లేదా సీబీఐతో విచారణ జరపాలన్నారు.

Leave a Reply