Cricket | నేడు మూడో టీ20

Cricket | నేడు మూడో టీ20

  • టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌
  • గౌహతి లోని బరాస్పర క్రికెట్ స్టేడియంలో
  • రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం
  • జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో లైవ్‌

Cricket | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : టీమిండియా టీ20లో మంచి జోరు మీద ఉంది. వ‌న్డేలు, టెస్టుల్లో ప‌రాజ‌యాలు ఎదుర‌వుతున్నా పొట్టి ఫార్మ‌ట్‌లో విజ‌యాల‌తో దూసుకుపోతోంది. వ‌చ్చే నెల‌లోనే వ‌ర‌ల్డ్ క‌ప్ ఉంది. ఈ నేప‌థ్యంలో భార‌త ఆట‌గాళ్లు మంచి ఫాంను ప్ర‌ద‌ర్శిస్తూ క‌ప్‌పై (Cup) ఆశ‌లు పెంచుతున్నారు. ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న సిరీస్‌లో టీమిండియా మొద‌టి రెండు మ్యాచుల్లో విజ‌యాలు సాధించింది. కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా ఫాంలోకి రావ‌డం క‌లిసొచ్చే అంశం. ఇవాళ జ‌రిగే మూడో మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి సిరీస్ ప‌ట్టేయాల‌ని టీమిండియా చూస్తుంది.

5 టీ20 ల సిరీస్‌లో భాగంగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచులు ముగిశాయి. ఈ రెండు మ్యాచ్ లలో కూడా టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇవాళ మ‌రో కీలక పోరుకు ఇరు జ‌ట్లు సిద్ధ‌మ‌య్యాయి. ఇవాళ మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. గౌహతి లోని బరాస్పర క్రికెట్ స్టేడియం (Stadium) వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మొదటి టీ20 సందర్భంగా చేతికి గాయం చేసుకున్న అక్షర్ పటేల్ మూడవ టీ20కి సిద్ధం అవుతున్నాడు. ఇక ఇవాళ గౌహతిలోని బరాస్పర స్టేడియం వేదికగా మూడవ టి20 జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లు జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చు.

Cricket

Cricket | స్టార్లు వచ్చేస్తున్నారు..

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోయే మూడవ టి20 నేపథ్యంలో ఇద్దరు టీమ్ ఇండియా స్టార్లు మళ్లీ జట్టులోకి వస్తున్నారు. అక్షర్ పటేల్ మొదటి మ్యాచ్ లో గాయం కారణంగా రెండవ మ్యాచ్ కు దూరమయ్యాడు. అయితే అతడు ఇప్పుడు కోల్పోన్నాడట. దీంతో కుల్దీప్ యాదవ్ స్థానంలో తుది జట్టులో అక్షర్ పటేల్ ఆడే ఛాన్సులు ఉన్నాయి. అటు రెండవ టి20 లో రెస్ట్ తీసుకున్న బుమ్రా ( Bumrah), హర్షిత్ రాణాలు రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Cricket

Cricket | భార‌త్ రికార్డు ఇలా..

బర్సపారా క్రికెట్ స్టేడియంలో T20 రికార్డుభారత క్రికెట్ జట్టు బర్సపారా క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు 3 T20 మ్యాచ్‌లు ఆడి, ఒక మ్యాచ్ గెలవగా, రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. నవంబర్ 2023లో ఆస్ట్రేలియా ఈ స్టేడియంలో భారత్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. 2022లో భారతదేశం దక్షిణాఫ్రికాను 16 పరుగుల తేడాతో ఓడించింది. ఈ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.

Cricket

Cricket | బ్యాటింగ్ పిచ్‌

బర్సపారా స్టేడియం పిచ్ నివేదికACA స్టేడియంలోని పిచ్ సాధారణంగా చదునుగా ఉంటుంది. బ్యాట్స్‌మెన్‌కు ఈ పిచ్ సహకారం అందిస్తుంది. ఇది ఎర్రమట్టి పిచ్ కాగా, సాయంత్రం పూట మంచు కురుస్తుంది. కనుక టాస్ గెలవడం రెండు జట్లకు చాలా కీలకం. బౌలర్లు ఇక్కడ స్వింగ్ రాబట్టవచ్చు. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. ఇక్కడ సైతం పరుగుల వర్షం ఖాయమని అంచనా వేశారు.

Cricket | ఇరు జ‌ట్ల అంచ‌నా

టీమిండియా XI: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా/హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ CV

న్యూజిలాండ్ XI: టిమ్ సీఫెర్ట్, డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ

CLICK HERE TO READ పాక్‌కు ఐసీసీ వార్నింగ్‌

CLICK HERE TO READ MORE

Leave a Reply