Fire accident | భవానిపురంలో అగ్నిప్రమాదం

Fire accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని భవానిపురంలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి ఒక అపార్ట్ మెంట్ లోని ఐదవ అంతస్తులో అగ్నికీలలు వ్యాపించాయి. ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అపార్ట్ మెంట్ లో చిక్కుకున్న వృద్ధులను కాపాడారు.
పోలీసులు సకాలంలో స్పందించడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. ఏసీల వినియోగం పెరిగిన నేపథ్యంలో వాటి నిర్వహణలో లోపాలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తున్నాయని, విద్యుత్ సరఫరాలో అకస్మాత్తుగా వచ్చే వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల షార్ట్ సర్క్యూట్లు సంభవించి అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
