observation | గిడ్డంగుల సంస్ధ గోడౌన్ పనుల పరిశీలన

observation | ఖమ్మం, ఆంధ్రప్రభ : మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం కమలాపురం గ్రామంలో రూ 9.70 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగుల సంస్ధ గోడౌన్ నిర్మాణ పనులను రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పరీశీలించారు. గోడౌన్ నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టరుతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యత లోపం లేకుండా నిర్మించాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యస్.సి శ్రీనివాస్, డీఈ రాజు తదితరులు పాల్గొన్నారు.

