Crime | ఇళ్ళల్లో చోరీలు చేసే అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

Crime | ఇళ్ళల్లో చోరీలు చేసే అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
- హనుమకొండ ఏసీపీ నరసింహారావు
Crime | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : తాళాలు వేసి ఉన్న ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను హన్మకొండ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను హన్మకొండ ఏసిపి నర్సింహ రావు పత్రికలకు విడుదల చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన గూగులోతు నవీన్ 2023 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 17 కు పైగా చోరీలకు పాల్పడ్డాడు.
దొంగతనాలకు ఓడకట్టిన దొంగ ఆ కేసులలో జైలుకెళ్లి వచ్చాడు. మళ్లీ ఈ సంవత్సరం సంక్రాంతి సెలవుల సందర్భంగా మట్వాడా, హనుమకొండ, కుషాయిగూడ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. అదే క్రమంలో శుక్రవారం రోజు హనుమకొండలో దొంగతనం చేయాలని ఉద్దేశంతో బస్టాండ్ కు వచ్చాడు.అప్పటికే నిఘా వేసిన హనుమకొండ పోలీసులు పట్టుకున్నారు.
దొంగ నుండి ఇళ్ళలో తాళాలు పగలగొట్టడానికి ఉపయోగించే పట్కార్ స్క్రూ డ్రైవర్లు, ఐరన్ రాడ్లు, 12 గ్రాముల బంగారు ఆభరణాలు 51 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు హన్మకొండ ఏసీపీ నర్సింహ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపి నర్సింహ రావు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా ఊరికి వెళ్లే సమయాల్లో విలువైన బంగారు ఆభరణాలు, డబ్బులు తమతో తీసుకెళ్లాలని సూచించారు.
చాకచక్యంగా దొంగను పట్టుకున్న బ్లూ కోల్డ్ సిబ్బంది హరిప్రసాద్, కుమార్ లను ప్రత్యేకంగా ఎసిపి అభినందించారు.దొంగ అరెస్ట్ చూపిన వారిలో హన్మకొండ ఇన్స్ పెక్టర్ మచ్చ శివకుమార్, ఎస్సై పరశురాం, సతీష్ లు పాల్గొన్నారు.
