Manchiryala | కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా ప్రభుత్వం..

Manchiryala | కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా ప్రభుత్వం..

  • ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Manchiryala | మంచిర్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో బి ఆర్ ఎస్.మాజీ కౌన్సిలర్ శ్రీపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టూ టౌన్ ప్రాంతానికి చెందిన యువకులతో ఈ రోజు పట్టణo లోని పద్మ నాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంచిర్యాల ఎమ్ ఎల్ ఏ. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం శ్రీపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభిమానం చురగోన్న‌దని ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అన్నారు.

Leave a Reply