Police | రిపబ్లిక్ డే రిహార్సల్స్ అదుర్స్..!

Police | రిపబ్లిక్ డే రిహార్సల్స్ అదుర్స్..!
Police | గుంటూరు కలెక్టరేట్ – ఆంధ్రప్రభ : అమరావతి రాజధాని పరిధిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఫుల్ డ్రెస్సు రిహార్సల్స్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ (DGP) హరీష్ కుమార్ గుప్తా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జే. శ్యామలరావులు పరిశీలించారు.. జంగారెడ్డి గూడెం ఏ ఎస్పీ, ఐ.పి.ఎస్ అధికారి ఆర్. సుస్మిత పరేడ్ కమాండర్ గా వ్యవహరించారు.

భారత ఆర్మీ, ఆంధ్రప్రదేశ్ 2వ పోలీస్ బెటాలియన్, సి.ఆర్.పి.ఎఫ్, పోలీసు సాయుధ దళాలు, ఆంధ్రప్రదేశ్ 16వ పోలీస్ బెటాలియన్, బాలురు, బాలికల విభాగాల ఎన్.సి.సి క్యాడెట్స్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థల విద్యార్థులు, రెడ్ క్రాస్ యువ దళం కంటింజెంట్స్ డ్రెస్ రిహార్సల్స్ ప్రదర్శించారు. స్పెషల్ పోలీస్ (Police) బ్రాస్ బాండ్, స్పెషల్ పోలీస్ – భారత ఆర్మీ మ్యూజిక్ బాండ్ లు అలరించాయి.

ఈ సందర్భంగా ప్రభుత్వ (GOVT) శాఖలు తమ అభివృద్ధిని తెలియజేసే ఆకర్షణీయ శకటాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఐ.జి రాజకుమారి, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
