Student Rape | భీమిలిలో దారుణ సంఘటన..

Student Rape | భీమిలిలో దారుణ సంఘటన..

  • విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం…
  • పోలీసుల అదుపులో నిందితుడు..

Student Rape | భీమిలి, ఆంధ్ర‌ప్ర‌భ : భీమిలిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ రోజు వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. భీమిలి పరిసర ప్రాంతాలలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినిపై అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినికి అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడడంతో చనువుగా ఉంటూనే బుధవారం రాత్రి ఆమెపై ఆ విద్యార్థి అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో భీమిలి పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వివరాలను గోప్యంగా ఉంచుతూ భీమిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply