Vikarabad | నిజం నిర్భయంగా రాసే ఆంధ్రప్రభ మరింత ఎదగాలి….

Vikarabad | నిజం నిర్భయంగా రాసే ఆంధ్రప్రభ మరింత ఎదగాలి….
Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : నిజం నిర్భయంగా రాసే ఆంధ్రప్రభ మరింత ఎదగాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యంలో ఆంధ్రప్రభ క్యాలెండర్‌ను డీసీసీబీ మాజీ డైరెక్టర్ కిషన్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ వి సత్యనారాయణ, ఆంధ్రప్రభ వికారాబాద్ పీసీ ఇంచార్జ్ ప్యా ట రవితో కలిసి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంధ్రప్రభ రోజురోజుకు మరింత ఎదుగుతుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రభ మరింత ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

