Rally | ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛ పరిపాలన….

Rally | ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛ పరిపాలన….

  • ఘనంగా నిర్వహించిన ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ కార్యక్రమం…
  • మంత్రి ఫరూక్

Rally | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలకు రాష్ట్రాన్ని పచ్చదనం పరిశుభ్రతతో ఉండేందుకు పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, రాష్ట్రాన్ని ‘స్వర్ణ ఆంధ్ర’గా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమం ఉద్దేశమని రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎంఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ షాది ఖానా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, శ్రీనివాస్ సెంటర్ వెంకప్ప అంగడి, ఎన్టీఆర్ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. మంత్రి మాట్లాడుతూ…. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత నంద్యాల కోసం, తడి-పొడి చెత్త వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

Rally

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూనే, స్వచ్ఛతలో కూడా అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం స్వచ్ఛందర ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అలాగే పారిశుద్ధ కార్మికులకు సేఫ్టీ కిట్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఇ గుర్రప్ప, 12 వార్డు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, మెప్మా పీడీ వెంకట దాస్, బింగ్ మల్లె శ్యాంసుందర్ గుప్తా, ఆనంద్ గురూజీ, కౌన్సిలర్ శ్రీదేవి, జిల్లెల్ల శ్రీరాములు, మునియార్ ఖలీల్, ఉప్పరి సురేష్ కుమార్, పసుపులేటి నారాయణ, చలం బాబు, బుగ్గ రాముడు, చింతల నాగ కుమార్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

Leave a Reply