Dandepalli | ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన..

Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ ఆదేశాల మేరకు డీపీఆర్ఓ క్రిష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ రోజు దండేపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కళా బృందం పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. సంక్షేమ పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రచారం చేశారు.
యువత చెడు వ్యసనాలకు (డ్రగ్స్) కు అలవాటు పడకుండా ఉండాలని, ఇంటి పరిసరప్రాంతంలో పరిశుభ్రతపై, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలను చైతన్యo చేయడం జరుగుతుందన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు పై, సన్న బియ్యం పథకంపై అవగాహన ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కుమ్మరి శ్రావణ్ కుమార్ టీం లీడర్, కొప్పర్తి సురేందర్, సల్లూరి కిష్టయ్య, బీర్పూరి శ్రీనివాస్, కొప్పర్తి రవీందర్, కాసిపేట సంతోష్, లింగపల్లి రాజేష్, గొల్లపల్లి శిరీష, వావిగాల నాగలక్ష్మి, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
