Dandepalli | విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సహాయం…

Dandepalli | విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సహాయం…

Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని రాజుగూడకు చెందిన సోయం దీపిక ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల బాలికల ఆశ్రమ పాఠశాలలో 9 తరగతి చదువుతుంది. ఇటీవల సంక్రాంతి పండుగ సెలవులకు ఇంటికి వచ్చిన దీపిక. అనారోగ్యం బారిన పడటంతో గురువారం రాత్రి మృతి చెందగా శనివారం మృతురాలు దీపిక కుటుంబ సభ్యులను అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఆఫీసర్ సదానందం, బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం అర్క మాణిక్ రావు, తాళ్ల పేట మాజీ ఎంపీటీసీ కంది హేమలత- సతీష్ కుమార్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాజీ ఎంపీటీసీ కంది హేమలత- సతీష్ కుమార్ కుటుంబానికి రూ. 5000 వేలు ఆర్థిక సహాయం అందజేసి ఔదార్యం చాటుకున్నారు. విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక నాయకులు అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి ఆర్ పి రఘునాథం, హెచ్ డబ్ల్యూఓ శ్రీవేణి, ఏఎన్ఎం విజేత, మాజీ సర్పంచులు అడాయి కాంతారావు, లింగారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కన్నాక జంగు, వార్డు సభ్యులు పున్నం, భీం రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్నాక జంగు, కొమరం తిరుపతి, సామ్ రావు, తిరుపతి, చిక్రం దేవ్ రావు, జంగు, తదితరులు ఉన్నారు.

Leave a Reply