Certificates | సర్పంచులకు శిక్షణ ప్రశంసా పత్రాలు అందజేత

Certificates | ఆళ్లపల్లి/ గుండాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ సారథ్యంలో గ్రామ పరిపాలనలో కీలకమైన సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ నిర్వహించడం ఎంతో శుభ పరిణామమని గ్రామ పరిపాలనలో సర్పంచి పాత్ర ఎంతో కీలకమని, గ్రామాభివృద్ధికి శిక్షణ ఎంత దోహదపడుతుందని ఉమ్మడి మండలాల సర్పంచులు పేర్కొన్నారు.

శుక్రవారం సర్పంచుల శిక్షణ ముగిసిననంతరం మాట్లాడుతూ.. ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులకు పల్లెపాలన, పంచాయతీరాజ్ చట్టం తదితర అంశాలపై తర్పీదు గ్రామ పరిపాలనకు ఎంతో జ్ఞానోదయం కలిగిందని చెప్పారు. గుండాల మండలంలో గెలుపొందిన 11 మంది, ఆళ్లపల్లిలో 12 మంది సర్పంచులకు మొత్తం ఉమ్మడి మండలాల్లోని 23 మందికి సోమవారం నుంచి శుక్రవారం వరకు హెర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రాంగణంలో శిక్షణ తరగతులను ప్రారంభించారని.. సర్పంచులు 5 రోజుల పాటు ఉండేందుకు భోజన, వసతి సౌకర్యాలను మెరుగ్గా ఏర్పాటు చేశారు.

పల్లె పరిపాలనలో గ్రామాల సర్పంచుల పాత్రపై ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు సర్పంచులు కృషి చేయాలని సూచించారని, శిక్షణను ఐదేళ్లకు సరిపడా రాజకీయ అనుభవజ్ఞంగా మేధావులుగా తర్విదును ఇవ్వడం ఎంతో శుభపరిణామమన్నారు.

ఈ కార్యక్రమంలో గుండాల పంచాయితీ సర్పంచ్ కోరం సీతారాములు, రోళ్లగడ్డ సర్పంచి భుక్య మంగమ్మ, దామరతొగు కల్తీ కృష్ణరావు, సాయనపల్లి కృష్ణవేణి, కాచనపల్లి సర్పంచ్ జర్పుల కిషన్, పడుగోనిగూడెం సర్పంచి ఈసం సంజీవరావు, శంబునిగూడెం సుమలత, శెట్టుపల్లి వసంతరావు, లింగగూడెం వెంకటేశ్వర్లు, మామకన్ను సర్పంచ్ కల్తీ రజిత, ముత్తపురం కల్తీ రాధ, రాయిపాడు సర్పంచి ఊకే చిన్న పాపయ్య, అనంతోగు వెంకటేశ్వర్లు, ఆళ్ళపల్లి సర్పంచి వాసం సుస్మిత, పాతూరు ఈసం రుక్మిణి, రామంజిగూడెం సర్పంచి మోకాల చంద్రశేఖర్, రాఘవాపురం సర్పంచి పాయం రామనర్సయ్య, మర్కోడు సుతారి రమాదేవి, నడిమిగూడెం తెల్లంసంద్యారాణి, బోడాయికుంట ఏడూల్ల శ్రావణీ, అడవిరామవరం పాయం సూర్యకాంతం, దొంగతోగుపాపయ్య, పెద్ద వెంకటాపురం వజ్జ ఉమా పాల్గొన్నారు.

Leave a Reply