Mopidevi | స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ…

Mopidevi | స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ…
- స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొన్న దేవస్థానం ఉద్యోగులు
Mopidevi | మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు “స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ & కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆలయ సిబ్బందికి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి, శుభ్రత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ పట్ల అందరూ కట్టుబడి ఉండాలని, స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించబడింది. సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.

