Tributes | ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుక‌లు

Tributes | ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుక‌లు

  • నేతాజీ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి

Tributes | మక్తల్, ఆంధ్రప్రభ : భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలబడి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసి, స్వాతంత్ర్య పోరాటానికి కొత్త ఊపునిచ్చిన అసమాన యోధుడు నేతాజీ శుభాష్ చంద్రబోస్ అని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ రోజు మక్తల్ పట్టణంలోని మంత్రి నివాసం క్యాంపు కార్యాలయం లో నేతాజీ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బానిసత్వపు సంకెళ్లను తెంచేందుకు నాకు రక్తం ఇవ్వండి… మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అంటూ దేశ యువతను ఉత్తేజపరిచిన నేతాజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలబడి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసి, స్వాతంత్ర్య పోరాటానికి కొత్త ఊపునిచ్చిన అసమాన యోధుడు నేతాజీ శుభాష్ చంద్రబోస్ అని మంత్రి కొనియాడారు.

దేశభక్తి, త్యాగం, కర్తవ్యనిష్ఠలతో నిండిన నేతాజీ ఆలోచనలు నేటి భారత నిర్మాణానికి మార్గదర్శకమని అన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ సేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలల భారతదేశాన్ని సాకారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి. లక్ష్మారెడ్డి, బి. గణేష్ కుమార్, కట్ట సురేష్ కుమార్, బోయ రవికుమార్, చెన్నయ్య గౌడ్, బోయ వెంకటేష్, గోవర్ధన్, బి.శంషుద్దీన్, కున్సి నాగేందర్, కట్ట వెంకటేష్, రుద్రసముద్రం సర్పంచ్ లింగప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply