22nd jan | పురాణపండ శ్రీనివాస్ చేత శ్రీమాలిక గ్రంథ ఆవిష్కరణ

22nd jan | సికింద్రాబాద్‌లో ఘనంగా బ్రహ్మోత్సవాలు
వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారి కల్యాణం
కళా జనార్ధనమూర్తి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు
భక్తులతో నిండిన ఆలయ ప్రాంగణం
22nd jan | 22పురాణపండ-1మంత్రపేటికను ఆవిష్కరిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్, కళా జనార్ధనమూర్తి తదితరులు
22పురాణపండ-1ఏ శ్రీమాలిక మంత్రగంథం వేదధ్వనుల మధ్య మంత్రపేటికను ఆవిష్కరించిన శ్రీనివాస్.!
శ్రీవారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించిన జనార్ధనమూర్తి
22nd jan | సికింద్రాబాద్, జనవరి 22 (ఆంధ్రప్రభ) : శృంగేరి పీఠానికి అనుబంధ దేవాలయాలుగా జంటనగరాల్లో అనేక దేవాలయాలు శృంగేరీ పీఠాధిపతుల అనుగ్రహంతో ఎన్నెన్నో వైదిక ధార్మిక కార్యక్రమాలను సంప్రదాయానుసారం నిర్వహించడం దశాబ్దాలుగా జరుగుతోంది. శృంగేరీ పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి కటాక్షం, తత్కమల సంజాతులైన విధుశేఖర భారతీస్వామి కారుణ్యంతో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని పంచముఖ ఆంజనేయ సమేత శ్రీలక్ష్మీ వెంకటేశ్వర దేవాలయానికి గత రెండురోజులుగా ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

మూడవరోజైన గురువారం వేదపండితులు, వైష్ణవాచార్యులు, అర్చకశ్రేష్ఠుల అద్భుత మంత్రఘోషల మధ్య భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం వేంకటాచల క్షేత్రంలో జరిగే అద్భుత శ్రీనివాస కల్యాణాన్ని తలపించేలా ఆలయ ధర్మాధికారి, సాంస్కృతికరంగ ప్రముఖులు కళా జనార్ధనమూర్తి అంగరంగవైభవంగా పరమ వైష్ణవ సంప్రదాయంలో ఈ పవిత్ర కల్యాణోత్సవాన్ని జరిపి, వందలమందిని ఆనందింప చేశారని కొనియాడారు.
ఈ సందర్భంగా బీఎస్సీపీఎల్ ఇన్‌ఫ్రా కంపెనీ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో తాను విలక్షణంగా విశిష్ట అంశాలు, పరమ పవిత్ర అంశాలతో అమోఘరచనా సంకలనంగా ఇరవై ఏడవ పునర్ముద్రణగా అందించిన శ్రీమాలిక 400పేజీల గ్రంథాన్ని వందలమంది భక్తుల మధ్య శ్రీనివాస్ స్వయంగా ఆవిష్కరించి వేంకటేశ్వరుని పాదాల చెంతనుంచారు.
నన్నేలు నాస్వామి, నేనున్నాను, శరణు శరణు, శంకర శంకర, శ్రీ పూర్ణిమ, శ్రీనిధి, సౌభాగ్య, అమ్మణ్ణి, భద్రే రుద్రే, జయం జయం, యుగే యుగే, మహా మంత్రస్య, మహాసౌందర్యం వంటి ఎన్నెన్నో ఆధ్యాత్మిక గ్రంథాల రచన సంకలనాల అమోఘరచయితగా, అద్భుతమైన వక్తగా, తెలుగు రాష్ట్రాల్లో విశేషఖ్యాతిగాంచిన పురాణపండ శ్రీనివాస్ ఆర్ష భారతీయ వైభవ గ్రంథాలు లక్షలాది గడపల్లో గత రెండున్నర దశాబ్దాలుగా దివ్యత్వంతో శోభిస్తున్నాయనేది సత్యం.
అతి చిన్న వయస్సులోనే ఎన్నో కష్టాలకోర్చి, పెను తుఫాన్‌లాంటి సమస్యలనెదుర్కొని కూడా దైవబలంతో, రేయింబవళ్ల అసాధారణ కృషితో, అమోఘ స్వయంప్రతిభతో పురాణపండ సృజన వైభవ పాండిత్య పతాకాన్ని దేశాల ఎల్లలు దాటించిన ఘనత శ్రీనివాస్‌కి దక్కిందనేది నిర్వివాదాంశం. త్యాగరాయ గాన సభకు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న కళారంగపు అంకితజీవి కళా జనార్ధనమూర్తి తాను ధర్మాధికారిగా ఉన్న ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయం, పంచముఖ ఆంజనేయ సమేత శ్రీలక్ష్మీ వేంకటేశ్వర దేవాలయాల్లో జరిగే అనేక దేవీ దేవతల ఉత్సవాల్లో పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంథాలకే పెద్దపీట వేస్తున్నారనేది వేలాది భక్తులు ముక్తకంఠంతో చెబుతున్న వాస్తవం.

ఆలయ ధర్మాధికారి కళా జనార్ధనమూర్తి బ్రహ్మోత్సవాల విశేషాలు వివరిస్తూ పవిత్రసొగసులు విరజిమ్ముతున్న శ్రీమాలిక గ్రంథం శ్రీవారి పరమ వైభవోత్సవాల్లో ఇలా ఇరవై ఏడవ పునర్ముద్రణగా, పురాణపండ శ్రీనివాస్‌లాంటి నిస్వార్థ సృజనాత్మక ప్రతిభాశాలి అందించడం కేవలం తిరుమల అనుగ్రహమేనని, శ్రీనివాస్ స్వచ్ఛహృదయం, కష్టపడే తత్వం, అసాధారణ ప్రతిభలు తనని ఎంతో ఆకట్టు-కున్నాయని అభినందించారు.
అనంతరం వేదవిదులైన పండితులు ప్రసాదాది అంశాలను భక్తులకు అందించారు. ఈ శ్రీకార్యంలో త్యాగరాయ గానసభ కార్యవర్గ సభ్యులు, శృంగేరికి చెందిన పండితులు, వందలమంది భక్తులు పాల్గొని గోవిందుని జయధ్వానాలతో ఆప్రాంతాన్ని మారుమోగించారు. పలువురు రాజకీయ సాంస్కృతిక ప్రతినిధులు కళా జనార్ధనమూర్తి బ్రహ్మోత్సవాలను నడిపిస్తున్న తీరును అభినందించారు.
