Central schemes | గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Central schemes | గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

  • బీజేపీ రాష్ట్ర నాయకురాలు సమంత

Central schemes | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ జి సమంత కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మున్సిపల్ అధ్యక్షురాలు చాడ మంజుల అధ్యక్షత జరిగింది.

ఈ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ… ప్రతి వార్డులో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లు అడగాలన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమన్నారు. అభ్యర్థులు ప్రణాళిక బద్ధంగా నిర్ణయాలు తీసుకొని, ప్రతి ఇంటిని కనీసం ఆరుసార్లు కలిసి ఓటును అభ్యర్థించాలని కార్యకర్తలకు కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.

కార్యక్రమం అనంతరం కొండగడప గ్రామానికి చెందిన బెల్లంకొండ ఆంజనేయులు, దొంతర బోయిన సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 30 మంది పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, మున్సిపల్ ఎన్నికల ప్రబారి దండు శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి గుజ్జ సోమ నరసయ్య, మోత్కూరు ఎన్నికల కన్వీనర్ కొనతం నాగార్జున రెడ్డి, కో కన్వీనర్లు గౌరు శ్రీనివాస్, పోచం సోమయ్య, నాయకులు ఎడ్ల రామ్ , ఏనుగు జితేందర్ రెడ్డి, గుదే మధుసూదన్ యాదవ్, అన్నెపు సత్యనారాయణ, జినుకల దశరథ, కందుకూరి ప్రకాష్, తీగల శ్రీధర్ గౌడ్, బీసు మధు , మహిళా నాయకురాలు మరాఠి విజయ లక్ష్మి, వనం రేణుక, యేశపోయిన రమణ, పురుగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply