Women’s Hostel | పెండింగ్ పనులు పూర్తి చేయాలి…

Women’s Hostel | పెండింగ్ పనులు పూర్తి చేయాలి…

  • తెలంగాణ యూనివర్సిటీ విసి యాదగిరిరావు…

Women’s Hostel | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ యాదగిరిరావు ఆదేశించారు. ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ను ఉపకులపతి ప్రో. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రో. యాదగిరితో కలిసి సందర్శించారు. మహిళల హాస్టల్ లో పెండింగ్ పనులు పర్యవేక్షించారు. ఇంకా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చెయ్యాలని ఇంజనీర్ వినోద్ ను ఆదేశించారు.

మహిళా హాస్టల్ సమస్యలను తన దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకురావాలని హాస్టల్ వార్డెన్ డా. సునీత కు తెలిపారు. సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ తమ కు ఉన్న సమస్యలను ఉపకులపతి దృష్టికి తెచ్చారు.వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.

సందర్శన సమయంలో గర్ల్స్ హాస్టల్ వార్డెన్ డా.సునీత, బాయ్స్ హాస్టల్ వార్డెన్ డా.యాలాద్రి, డా.నారాయణ, డా. సరిత పిట్ల, అధ్యాపకులు డా.రమాదేవి, డా.నిరంజన్ శర్మ ,దిలీప్, శ్రీకాంత్ విమెన్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి, డా .శ్రీమాత, డా.పోతన్న, డా.ఇంద్రకరణ్, డా.కనకయ్య, డా.సునీల్, శ్రీనివాస్, గర్ల్ హాస్టల్ కేర్ టేకర్ హారిక తదితరులున్నారు.

Leave a Reply