Sarpanch | ఉచిత కంటి వైద్య శిబిరం…

Sarpanch | బిక్కనూర్, ఆంధ్రప్రభ : కంటి వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో అభినందనీయమని బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ సర్పంచ్ శ్రీవాణి వాసు యాదవ్ అన్నారు. ఈ రోజు గ్రామంలో కామారెడ్డి లయన్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… కంటి వ్యాధులతో ఎవరు బాధపడినా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
అవసరం ఉన్నవారు కంటి అద్దాలు వాడుకోవాలని ఆమె కోరారు. గ్రామంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వైద్యాధికారి లింబాద్రి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ప్రకాష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి సిద్ధిరాములు, వార్డు సభ్యులు కొండం సుజాత, కుమ్మరి జ్యోతి, భాను ప్రకాష్ తదితరులు ఉన్నారు.
