Review meeting | నిర్మాణ పనులను వేగవంతం చేయాలి..

Review meeting | నిర్మాణ పనులను వేగవంతం చేయాలి..

  • ఎంపిడిఓ లవ కుమార్

Review meeting | ముధోల్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ లవ కుమార్ మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పనులను పూర్తి చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.

మార్కౌట్ ఇవ్వని ఇండ్లకు మార్కౌట్ ఇచ్చే విధంగా అదేవిధంగా మార్కౌట్ ఇచ్చి కూడా బేస్మెంట్ లెవెల్ వరకు రాని ఇండ్లకు సంబంధించి పనులను పూర్తి చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీలలో గల అన్ని నర్సరీలలో బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్, ఏపీఓ శిరీషా, ఏఈ హౌసింగ్, ఏఈ మిషన్ భగీరథ, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply